- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణకు కృతజ్ఞతలు
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల అభివృద్ధికి రూ.1 కోటి నిధులు మంజూరవ్వడంతో పట్టణ ప్రజానీకం, వాకర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ ఎన్నికల హామీని నెరవేర్చుతూ వాకర్స్ కోసం నూతన వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైట్లు, టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేశారు.నిధుల మంజూరుతో ఉత్సాహభరితులైన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఎమ్మెల్యే విజయరమణ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆయన నిబద్ధత, అభివృద్ధి పట్ల ఆసక్తి అభినందనీయం. ఆయన నాయకత్వంలో పెద్దపల్లి పట్టణం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


