రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలుగా నిలవాలి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రస్థాయి సీనియర్స్ ఖో ఖో పోటీల్లో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన ఉమ్మడి జిల్లా జట్లు ప్రతిభ చూపి విజేతలుగా నిలవాలని సుడా చైర్మన్, జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు.జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో జరుగుతున్న మహిళలు,పురుషుల సీనియర్స్ ఖో ఖో జట్ల శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడుతూ.కోచ్‌ల శిక్షణలో క్రీడాకారులు ప్రతిరోజూ కృషి చేస్తూ ఖో ఖోలోని నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటున్నారని అన్నారు.ఈనెల 7, 8, 9 తేదీలలో పెద్దపల్లి జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్లు ప్రతిభ కనబరచి, విజయాలను సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ ఉపాధ్యక్షులు ట్రాఫిక్ ఆర్.ఐ. కుమారస్వామి, రాష్ట్ర డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు డా. సురేందర్ రెడ్డి, ఎస్.ఆర్.ఆర్. కళాశాల ఉపన్యాసకులు సూర్యప్రకాశ్, డా. ఏ. రవీందర్, కట్ట సంతోష్, కరుణాకర్, అశోక్, రాములు, ఖో ఖో కోచ్‌లు వెంకటేష్, ఆనంద్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.


