ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
కాకతీయ పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు జె గ్రామంలో వడ్డెర కాలినికి చెందిన అలకుంట్ల వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ చేరికలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారయణ, మండల అధ్యక్షుడు గిరగని కుమారస్వామి,తొర్రూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలివేరు బాలరాజు, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, మాజీ దేవస్థాన చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, ఓబీసీ సెల్ స్టేట్ కో కోఆర్డినేటర్ పులి గణేష్, పసులది ఐలయ్య, బత్తోజు రామస్వామి, బొమ్మిశెట్టి ఎల్లయ్య, బొమ్మిశెట్టి ఐలయ్య, వల్లేపు మల్లయ్య, బొమ్మిశెట్టి శ్రీను, బొమ్మిశెట్టి కుమార్, పులి భాస్కర్,గ్రామ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు


