epaper
Wednesday, March 25, 2026
epaper

ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌..
198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం
26,160 మంది అభ్యర్థుల దరఖాస్తు
మార్చి 29న రాత పరీక్ష..

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : టీజీ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వ‌హించేందుకు హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 198 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టగా, అందులో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. భారీగా దరఖాస్తులు రావ‌డంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. మార్చి 29న రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షను రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మార్చి 23 ఉదయం 8 గంటల నుంచి మార్చి 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా హాల్ టికెట్‌లో ఉన్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఫొటో లేకపోతే పరీక్షకు అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.

26,160 మంది అభ్యర్థుల దరఖాస్తు

మొత్తం 26,160 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 20,097 మంది ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులకు, 6,063 మంది మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు అప్లై చేశారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా తదుపరి దశలకు ఎంపిక చేస్తారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించనున్నారు. వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలు తీసుకుంటారు. అందువల్ల చేతులపై మెహందీ, టాటూలు ఉండకూడదని స్పష్టం చేశారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే ఈమెయిల్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై...

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్,...

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌ ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌ ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ,...

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై?

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై? విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం సంచలన వ్యాఖ్యలు ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు...

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌.. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌ మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు లారీల ఓన‌ర్ల నుంచి...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌ రెండేళ్లుగా విడ‌దీయ‌రాని బంధం మార్జాలం చినిపోవ‌డంతో మ‌నోవేద‌న‌ పురుగుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img