ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు
జిల్లా ఉపాధి కల్పనాధికారి వై. తిరుపతిరావు
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వై. తిరుపతిరావు తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజన వసతితో మూడు నెలల శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణలో సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలపై శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థలో 20 ఖాళీలు ఉండగా డిప్లొమా, బీటెక్ (ఎలక్ట్రికల్, మెకానికల్) విద్యార్హత కలిగిన 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో పెద్దపల్లి నూతన కలెక్టర్ భవన సముదాయంలోని జిల్లా ఉపాధి కార్యాలయం (రూమ్ నెం. 233)లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.


