కరీంనగర్‌లో 11న జాబ్ మేళా
విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (బైపీసీ, వృత్తి విద్య, కంప్యూటర్లు) పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన ఈ మేళా నిర్వహించబడుతుంది. కరీంనగర్ బస్టాండ్ సమీపంలోని చర్చి లైన్‌లో ఉన్న స్పేస్ కంప్యూటర్ విద్యా కేంద్రంలో ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. విద్యార్థులు కనీసం 75 శాతం మొత్తం మార్కులు సాధించి ఉండాలి. గణితం అభ్యసించిన వారు మొత్తం 75 శాతం మార్కులతో పాటు గణితంలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 6303207394 నంబర్‌ను సంప్రదించవచ్చు.


