శాతవాహన వర్సిటీలో ఉద్యోగ మేళా
కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి మెగా ఉద్యోగ మేళా విజయవంతంగా నిర్వహించబడింది.విశ్వవిద్యాలయం, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ కలసి నిర్వహించిన ఈ మేళా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజ పరిస్థితులకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.విశ్వవిద్యాలయ ఉపకులపతి మాట్లాడుతూ, ఈ మేళా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతుందని, ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ విద్యార్థులు, జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో 821 మందికి పైగా నిరుద్యోగులు హాజరై, 247 మందిని సంక్షిప్త జాబితాకు ఎంపిక చేసి 198 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ప్లేస్మెంట్ అధికారి మాట్లాడుతూ, మేళా ద్వారా నిరుద్యోగులు ఏ రంగాలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, తమ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తుందన్నారు. విభిన్న రంగాల 67కి పైగా సంస్థలు మేళాలో పాల్గొని నిరుద్యోగులకు నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను అందించాయి.


