epaper
Monday, March 2, 2026
epaper

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై జీవో..

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై జీవో..

నేడోరేపో ప్ర‌భుత్వం నుంచి ఉత్త‌ర్వులు
42 శాతం ఇచ్చిన త‌ర్వాతే స్థానిక ఎన్నికలు
రాజ్యాధికార దిశగా బ‌డుగుల‌కు ఉన్నత ప‌ద‌వులు
చాక‌లి ఐల‌మ్మ పోరాటం భ‌విష్య‌త్ త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌కం
బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
ర‌వీంద్ర‌భార‌తిలో ఐల‌మ్మ జ‌యంతి వేడుక‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై నేడో, రేపో జీవో వస్తుంద‌ని, 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ కుల సర్వే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింద‌ని, ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా న్యాయపరంగా, చట్టపరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దళితులకు, గిరిజనులకు రాజ్యాంగపరంగా ఎంత రిజర్వేషన్లు ఉంటే అంత ఇస్తూ .. బీసీలకు 42 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంద‌న్నారు. రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది.. కాపాడుకునే బాధ్యత మీద‌న్నారు. 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగితే రాజ్యాధికార దిశగా ఉన్నత ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్నారు. ర‌వీంద్రభారతిలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకల‌కు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజ‌ర‌య్యారు. ఇనుగుర్తి మధు రాసి పాడిన పాటను & రజకుల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

ధీర వ‌నిత ఐల‌మ్మ‌..

భూమి కోసం, భుక్తి కోసం నిరంకుశ పాలనపై పోరాడిన ధీర వనిత ఐల‌మ్మ అన్నారు. సామాజిక న్యాయం కోసం, మహిళలకు గౌరవం భంగం కలిగితే తిరుగుబాటు చేశార‌న్నారు. 130 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తరుపున ఆమె జయంతిని జ‌రుపుకుంటున్నాం అంటే ఆమె ఎంతో గొప్ప పోరాట యోధురాలు అన్నారు. కుల వృత్తులు నాముషి కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాల‌ని, అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అన్నారు. రజకుల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామ‌ని, 119 నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ డ్రైకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికల రూపొందించామ‌న్నారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పై అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా జరగాలని ఆదేశాలు ఇచ్చాం.. అధికారులు అడ్డంకులు సృష్టిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించామ‌న్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img