కాకతీయ, వరంగల్: జానకిపురం మాజీ సర్పంచ్ నవ్య గాత్రం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె పాడిన మహా కనక దుర్గపాటను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. మాధుర్యమైన స్వరంతో, భక్తి పూర్వకంగా ఆలపించిన ఈ గీతం వినేవారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.
ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఈ పాట మరింత ప్రాచుర్యం పొందుతోంది. నవ్య గాత్రం భక్తి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసినప్పటికీ, తన గానం ద్వారా భక్తి రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా కొన్నాళ్ల క్రితం స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై నవ్య లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం రాజకీయంగా పెనుదుమారం లేపింది.
Courtesy: RTIMES HD


