జమ్మికుంట మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో
ఏకగ్రీవంగా చైర్మన్‌గా మోలుగూరి ప్రశాంత్ కుమార్ ఎన్నిక
వైస్ చైర్మన్‌గా ముంతాజ్ అలీ ప్రమాణ స్వీకారం
కాకతీయ, జమ్మికుంట: తీవ్ర ఉత్కంఠ నడుమ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చివరకు బీ ఆర్‌ఎస్ ఖాతాలో పడింది. మోలుగూరి ప్రశాంత్ కుమార్ (దిలీప్) ను మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ముంతాజ్ అలీ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. చివరకు అన్ని పరిణామాల అనంతరం మోలుగూరి ప్రశాంత్ కుమార్‌కు ఏకగ్రీవ మద్దతు లభించడంతో చైర్మన్ పదవి దక్కింది. అనంతరం ముంతాజ్ అలీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

భారీ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ముగియడంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు.


