కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కీలక అడుగులు వేస్తూ, రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కు మోహన్‌ను జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
జక్కు మోహన్ గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం ద్వారా మండలం, జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత బలపడతాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా జక్కు మోహన్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.


