- అవినీతి ఆరోపణలతో సీపీ చర్యలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా వర్ధన్నపేట ఏసీపీ పరిధిలోని జఫర్గఢ్ ఎస్సై రామ్ చరణ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి నివేదికను సీపీకి సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా రామ్ చరణ్ పై కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు అమలు చేశారు. కాగా, ఇది రామ్ చరణ్ పై వచ్చిన మొదటి ఆరోపణ కాదు.
గతంలో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర ఎస్సైగా పనిచేసిన సమయంలో, ఉప్పరగూడెం సర్పంచ్ భర్తను కొట్టిన ఘటనలో కూడా ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మరోసారి సస్పెన్షన్‌కు గురైన అతడిపై పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.


