కాకతీయ, ఖానాపురం : ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాడి అచ్యుతం, యూత్ అధ్యక్షుడిగా గోనెల మురళి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం గ్రామ కమిటీని యూత్ కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమన్వయ పరుచుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ బాధ్యతలు, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా జాడి అచ్యుతం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


