- ముమ్మరంగా ‘ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు’
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో ఇంటింటికి బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ప్రజలకు పంపిణీ చేసిన కార్డుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇప్పటివరకు నెరవేర్చని వాగ్దానాలు, ఒక్కో వ్యక్తికి పడిన బాకీ వివరాలు పొందుపరిచారు. ప్రజలు ఈ బాకీ కార్డు చూసి మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ? అని ప్రశ్నించాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలైనా ఒక్క హామీ సక్రమంగా అమలు కాలేదు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పింఛను దారులు అందరూ మోసపోయారని గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రతి ఇంటికి బాకీ కార్డులు అందజేస్తూ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజల మద్దతుతో మళ్లీ బలమైన ప్రజా ఉద్యమం మొదలుపెట్టాలని, కాంగ్రెస్ మాయ మాటలకు మళ్లీ నమ్మకూడదన్నారు. ఈ బాకీని ప్రజల తీర్పుతో వసూల్ చేసుకుందామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారం నిర్వహించారు.


