- వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం పెద్ద చెరువులో నీటి మట్టం పెరిగింది. దీంతో తూము పూర్తిగా ముసుకుపోయి చెరువుకు వెనుక భాగాన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు తూము ముసుకుపోవడం వల్ల పంట పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతుల పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి తూమును సత్వరం మరమ్మతులు చేయాలని ఆదేశించారు. చెరువుకు సంబంధించిన భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చెరువును పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


