- మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు
కాకతీయ, గీసుగొండ : మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావుకు చెందిన లేఅవుట్‌లో హద్దురాళ్లను ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది కుట్ర పూరితంగా తన పేరు చెడగొట్టడానికి తాను చేసిన లేఔట్ వెంచర్ ప్లాట్లలోని హద్దురాలను ధ్వంసం చేసినట్లు ఆయన ఆరోపించారు. తాను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకొని వెంచర్‌ను అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. తన లేఅవుట్ చట్టబద్ధమైనదని తెలిసి కూడా ఒకరిద్దరు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ కక్షతో తన పేరును చెడగొట్టడానికి కుట్రపూరితంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


