జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరానికి చెందిన తుమ్మ ఇషాన్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఇటీవల కరీంనగర్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ పోటీల్లో ఈ విజయం సాధించాడు.
కరీంనగర్ పోలీస్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తుమ్మ ప్రవీణ్ కుమార్ కుమారుడు ఇషాన్ అండర్-13 కాంపౌండ్ విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. అద్భుత లక్ష్యసాధనతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ఇషాన్ ఈ నెల 8న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతని తల్లిదండ్రులు, కోచ్ అభిషేక్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇషాన్ సాధించిన విజయంపై కరీంనగర్ ఆర్చరీ క్రీడాకారులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.


