సిరిస్ సమర్పణేనా..?! డ్రా కూడా కష్టేమేనా..?!
కాకతీయ, మాంచెస్టర్(జూలై 26) : భారత్- ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరిస్‌లో ఇంగ్లీష్ జట్టు పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఒకటి, మూడు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ నాలుగో టెస్టులోనూ పట్టు బిగించేసింది. మొదటి ఇన్నింగ్స్‌లోనే భారత్‌పై 180 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండోఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయడంతో పాటు బౌలర్లు అదే స్థాయిలో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చగలిగితేనే డ్రాపై ఆశలు పెట్టుకోవచ్చు.. అయితే జో రూట్ మంచి ఫాంలో ఉన్నాడు. పరుగుల యంత్రంగా మారిపోయాడు. ఈనేపథ్యంలో భారత్ సిరిస్‌ను డ్రాగా మిగిల్చితే అదే పదివేలు.. అన్న విశ్లేషణలు వ్యక్తమవుతోంది. రెండో టెస్టులో విజయం సాధించిన భారత్ ఆ తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో ఇంగ్లండ్‌లో రాణించడం లేదు.


