epaper
Thursday, March 19, 2026
epaper

అల్లుడే హంత‌కుడు ?

అల్లుడే హంత‌కుడు ?

సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి..

భార్య, మామను కిరాత‌కంగా చంపినట్లు అనుమానం !

కుటుంబ కలహాలే కార‌ణం?

రాజీవ్ గృహకల్పలో తండ్రి, కుమార్తె సజీవ దహనం

మంటల్లో సజీవ దహనమైన తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ

హనుమకొండ జిల్లా క‌డిపికొండ‌లో దారుణం

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ‌ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం క‌డిపికొండ‌లో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కుమార్తెలు సజీవ దహనమయ్యారు. అల్లుడు ప్రవీణ్ కుటుంబ కలహాలతో ఇద్దరినీ సజీవదహనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. భాషబోయిన రాజశేఖర్ (54) అతని కుమార్తె రాజశ్రీ (24) మంటల్లో కాలిపోతుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆటో డ్రైవర్​గా పని చేస్తున్న భాషబోయిన రాజశేఖర్​కు ముగ్గురు కుమార్తెలు కాగా రాజశ్రీ పెద్దమ్మాయి. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్​లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప ఉన్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలతో వచ్చి తండ్రితో పాటే హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రాజీవ్‌గృహకల్పలో బ‌్లాక్ 5లో ఉంటోంది. కుటుంబ తగాదాలు, భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఈ తరుణంలో రాజశేఖర్, రాజశ్రీ (24) సజీవ దహనమ‌య్యారు.

పొంతనలేని సమాధానాలు

భార్యతో గొడవలు తదితర కారణాలతో అల్లుడు ప్రవీణే భార్య, మామను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుత్తితో తలమీద కొట్టి ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అనాథలైన పిల్లలు

నిన్నటివరకూ బాగానే ఉన్న తండ్రీ కుమార్తెలు ఇద్దరూ మంటల్లో కాలిపోయి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజశ్రీ చనిపోవడంతో రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ జ‌రిగిన‌ట్లు తొలుత ప్రచారం

పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం గదిలో ఉన్న ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. ఇంట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు తప్పించుకునే అవకాశం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. విద్యుత్ లోపం కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై స్పష్టత రానుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు

సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు న‌మోదు విచారణ...

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి..

వ్యాధి నిరోధక వంగడాలు వాడాలి.. *రైతు శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకతీయ,గీసుగొండ: పంటలను...

మౌలిక వసతులు క‌ల్పించాలి

మౌలిక వసతులు క‌ల్పించాలి కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38...

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి కాకతీయ, దుగ్గొండి: విద్యార్థులు ప్రాధమిక దశలో అభ్యసించిన...

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు కాకతీయ, పెద్దవంగర : ప్రజా...

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు

అనుమతి లేకుండా అడుగుపెట్టొద్దు ట్రాన్స్‌కోలో సీఈ తీరుపై విమర్శలు వరంగల్ జోన్‌లో చీఫ్ ఇంజనీర్‌పై...

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..!

ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో దారుణం..! తండ్రీకూతుళ్లు సజీవ దహనం కాజీపేటలో విషాద ఘటన కలకలం తెల్లవారుజామున...

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img