epaper
Monday, March 2, 2026
epaper

కల్పలత సూపర్‌బజార్‌లో అవకతవకలు

కల్పలత సూపర్‌బజార్‌లో అవకతవకలు
ఆకస్మిక తనిఖీలో బయటపడిన కుంభకోణం
రికార్డులు సీజ్‌ చేయాలని ఆదేశాలు
– ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ పరిధిలోని కల్పలత సూపర్‌బజార్‌లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కల్పలత సూపర్‌బజార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సమయంలో సిబ్బంది లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్‌లో ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం, వారిలో ఇద్దరే విధుల్లో ఉండటంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. జమా–ఖర్చు వివరాలు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

బినామీల పేర్లతో జీతాలు

తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. సభ్యత్వ నమోదులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, సభ్యత్వ రుసుముల వినియోగానికి సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. పాలకమండలి సభ్యులు గత మూడేళ్లుగా సొంత అవసరాలకు డీజిల్‌, పెట్రోల్‌ను వినియోగించుకున్నారని, ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోవడమే కాకుండా బిల్లులు కూడా చెల్లించలేదని వెల్లడించారు. కో–ఆపరేటివ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌ బంక్‌లో 10 మంది సిబ్బంది పేర్లతో నెలకు రూ.10వేల చొప్పున జీతాలు తీసుకుంటున్నారని, అయితే రిజిస్టర్లలో వారి సంతకాలు లేవని తెలిపారు. బినామీ పేర్లతో జీతాలు చెల్లించినట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

కమిటీ రద్దు.. విచారణకు ఆదేశం

అవకతవకలపై వెంటనే సంబంధిత రికార్డులను సీజ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా సూచించారు. ఆదేశాల మేరకు ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. కల్పలత సూపర్‌బజార్‌ కమిటీని తక్షణమే రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌, ఆర్‌డీఓలకు ఎమ్మెల్యే సూచించారు. తనిఖీల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా రోజులుగా కల్పలత సూపర్‌బజార్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే తప్పు చేసిన వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img