లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఇనుగాల
ప్రజల సంక్షేమం, శాంతి కోసం ప్రార్థనలు
కాకతీయ, గీసుగొండ: పరకాల నియోజకవర్గ ప్రజలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించానని డీసీసీ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దేవుని ఆశీస్సులు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శాంతి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆరకట్ల సాయి తదితర నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


