యువ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ గుర్తింపు
కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి కృష్ణ కాలనీకి చెందిన బుర్ర మణిదీప్ గౌడ్ తన పరిశోధనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. గోవా బిట్స్ పిలానీ క్యాంపస్‌లో పీహెచ్.డీ చేస్తున్న ఆయన హోలిన్ ప్రోటీన్ పై చేసిన అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రీయ పత్రిక ఫెబ్స్ లెటర్స్ లో కవర్ ఆర్టికల్‌గా ప్రచురితమైంది. వైరస్‌లు బాక్టీరియాలను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని భూపాలపల్లిలో స్థానికులు, గౌడ సంఘం నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం యువతకు ప్రేరణ అని నాయకులు అభినందించారు.


