epaper
Friday, March 13, 2026
epaper

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి

సింగరేణి కార్మికులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి
క్వార్టర్లు మాజీ కార్మికులకే కేటాయించాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని వినతి

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు రూ.30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలు అందించడంతో పాటు, సింగరేణి క్వార్టర్లను మాజీ కార్మికులకే కేటాయించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *కిషన్ రెడ్డి*కి విజ్ఞప్తి చేశారు. మంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా ఆదివారం ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కూనంనేని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన మెమోరాండంను మంత్రికి అందజేశారు.

కొత్త గనులు, ఉపాధి అవకాశాలు

భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడిన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పెనగడప, పూనుకుడుచెలక, రాంపూర్, గుండాల ప్రాంతాల్లో తక్షణమే కొత్త భూగర్భ బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు తమ జీవితాన్ని గనులకే అంకితం చేశారని, వారి భవిష్యత్తు భద్రత కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ.30 లక్షల వడ్డీ లేని గృహ రుణాలు అందించాలన్న డిమాండ్‌ను మంత్రికి వివరించినట్లు చెప్పారు. పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకుండా చెల్లించాలని కూనంనేని కోరారు. అలాగే పాత సింగరేణి క్వార్టర్లను కూల్చివేయకుండా, ప్రస్తుతం నివసిస్తున్న మాజీ కార్మికులకే వాటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుల కార్పొరేట్ మెడికల్ బోర్డు సేవలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగించాలని, వైద్య సదుపాయాల విషయంలో రాజీ పడరాదని మంత్రికి స్పష్టం చేసినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ బాధ్యత

సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, కార్మికుల న్యాయమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మంత్రిని విన్నవించినట్లు చెప్పారు. ఈ భేటీలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు నెరేళ్ల రమేష్, పి. సత్యనారాయణచారి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img