- నిర్మాణ స్థలాన్ని పరిశీంచిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
కాకతీయ, నర్సంపేట: నర్సంపేట డివిజన్ సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించుటకు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆయన మాట్లాడుతూ దాదాపు 28 కోట్ల రూపాయల తో నర్సంపేట డివిజన్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయలు రెవిన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, ఏడీఏ, ఎంఈఓ, సబ్ రిజిస్టార్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని ఒకే చోట నిర్మాణం చేసి ప్రజలకు అన్ని కార్యాలయాలు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా సౌకర్యం కల్పించనున్నామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాలయి శ్రీనివాస్, కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, నాయకులు దేవేందర్ రావు, పెండెం రామనంద్, గజ్జి రాజు, కత్తి కిరణ్, మైదం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


