కాకతీయ, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో గురువారం విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎరువుల దుకాణాల్లో యూరియా నిల్వలను, బిల్స్, స్టాక్, లైసెన్స్ ల వివరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిఐ ప్రశాంత్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈ సిహెచ్. సురేష్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట పట్టణంలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


