తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..
తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ గురువారం తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంతో పాటు చిగురుమామిడి, గన్నేరువరం, ఎల్.ఎం.డి. పోలీసు స్టేషన్ల రికార్డులను ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా అండర్ ట్రయల్ (యు టీ) కేసుల రికార్డులు, కమిషనరేట్ కంప్లైంట్ సెల్ (సీసీసీ) ఫిర్యాదుల రిజిస్టర్, నెలవారీ క్రైమ్ రిపోర్టుల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై వివరాలు తెలుసుకుని, వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్‌ను ఆదేశించారు.రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, ప్రతి కేసుపై సమయానుకూలంగా పర్యవేక్షణ జరగాలని అడిషనల్ డీసీపీ సూచించారు.ఈ తనిఖీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, సాయికృష్ణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


