కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 53వ డివిజన్ కాశ్మీర్ గడ్డలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాత డ్రైన్ కూలిపోవడంతో స్థానిక ప్రజలకు ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే అధికారులు స్పందించి డ్రైన్ మరమ్మత్తు పనులను ప్రారంభించారు.
ఆ పనుల పురోగతిని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ,ప్రజల సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు చురుకుగా స్పందించడం అభినందనీయమైన విషయం. కాశ్మీర్ గడ్డ ప్రాంత ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ కి,సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


