- డీఆర్ఓ బి. వెంకటేశ్వర్లు
కాకతీయ, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ ఎలక్షన్స్ (డిఆర్ఓ) బి. వెంకటేశ్వర్లు రాజకీ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంల పరిశీలన చేసి సమగ్ర నివేదికలను సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఈవీఎం రక్షణ, భద్రత ఏర్పాట్లను సిబ్బందితో వివరంగా తెలుసుకున్నారు.
అలాగే గోదాంలో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పర్యవేక్షించారు. పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్‌ఎస్ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, సిపిఎం ప్రతినిధి మిల్కూరి వాసుదేవ రెడ్డి, ఎంఐఎం ప్రతినిధి బర్కత్ ఆలీ, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బీఎస్‌పి ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


