- కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారతదేశ రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేసేందుకు వినూత్న పర్యావరణ వ్యవస్థను రూపొందించనున్నట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని అన్నారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం అన్నారు. కొత్తగా వస్తున్న సాంకేతికత ఏళ్ల తరబడి పరిశోధన అభివృద్ధి ఆధారంగా రూపొందించినదన్నారు. దీన్ని మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రత అవసరాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్, ఏటా పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.


