epaper
Saturday, November 15, 2025
epaper
  • అవసరం లేని పురుగుమందుల‌ను అంటగడుతున్న వైనం
  • మోతాదు పెంచి అమ్ముతూ లాభాలు గ‌డిస్తున్న‌ వ్యాపారులు
  • పంట న‌ష్టంతో బెంబేలెత్తుతున్న రైతులు
  • న్యాయం చేయాలంటూ వేడుకోలు

కాకతీయ, నర్సింహులపేట : ఆరుగాలం కష్టపడే రైతన్నకు అడుగ‌డుగునా అవరోధాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో సతమతమైన రైతులకు ఒకవైపు యూరియా సంక్షోభం త‌లెత్తింది. వేకువ జామున లేచింది మొదలు రాత్రి వరకు యూరియా కోసం జాగారం చేయ‌డం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్ర‌తీ స‌మ‌స్య‌ను ఎలాగోలా నెట్టుకొస్తున్న అన్న‌దాత‌కు క్రిమి సంహార‌క‌ ర‌సాయానుల విక్ర‌య‌దారుల నుంచి కొత్త‌ర‌కం స‌మ‌స్య వ‌స్తోంది. త‌మ పంట చేతికందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నత‌రుణంలో ఫెస్టిసైడ్ వ్యాపారులు అంట‌గ‌డుతున్న మందుల‌తో పంట మొత్తం న‌ష్ట‌పోయే ప‌రిస్థితి దాపురించింది. పెట్టుబడులు పోనూ ఈ ఏడాది అయినా పంట‌ కలిసి వస్తుందేమోనని ఎదురుచూస్తున్నఅన్నదాతలకు నిరాశే మిగులుతోంది. అన్న‌దాత‌కు అవసరంలేని పురుగు మందులను అంటగడుతూ దుకాణా దారులు రైతులను నట్టేట ముంచుతున్నారు.

తాజాగా ఈ కోవ‌లోనే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మన గ్రోమోర్ సెంటర్ నిర్వాహకుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. స‌ద‌రు సెంటర్ నిర్వాహకులు అమాయక ప్రజలే టార్గెట్ చేసుకుని మూడు పూవులు ఆరు కాయ‌లుగా వ్యాపారం సాగిస్తున్నారు. పంట‌కు అవసరంలేని మందులను అంటగట్టడంలో వీరు సిద్ధ‌హ‌స్తుల‌ని ప‌లువురు రైత‌న్న‌లు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన మోతాదును మించి డోస్ పెంచి అమ్ముతూ లాభాలు గ‌డిస్తున్నారు. నర్సింహులపేట మండలంలోని బోజ్జన్నపేట గ్రామానికి చెందిన జాగాటి రామ్మూర్తి తనకున్న రెండు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేశాడు. వరి పంటకు రోగం తగలడంతో మన గ్రోమోర్ సెంటర్ కు వెళ్లాడు. వరిలో పురుగు చనిపోవుట గాను 20 పంపులకు ప్రోపనోపాస్, ట్రైసైక్లో జోల్ కాంబినేషన్లో మందులను రైతుకు సెంటర్ వారు ఇచ్చారు. ఈనెల ఏడో తేదీన రైతు 20 పంపులు పిచికారి చేశాన‌ని తెలిపారు.

ఈ క్ర‌మంలో పొలానికి వెళ్లి చూడగా పొలం మొత్తం ఎరుపు రంగులోనికి మారడంతో స‌ద‌రు రైతు బిక్క మొహంతో ఆందోళ‌న చెందిన‌ట్లు తెలిపారు. చుట్టుపక్క రైతులను సంప్రదించగా పురుగుమందు డోసు పెరగడంతో పొలం ఎండిపోయినట్లుగా నిర్ధారించారు. తనకు అధిక మోతాదు పురుగుమందును అంటగట్టిన వ్యాపారుల‌పై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విష‌య‌మై మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్ ను వివ‌ర‌ణ కోర‌గా ప్రోపోనోపాస్ 50 ఈసీ పురుగుమందును 2 ఎంఎల్‌ మందును ఒక లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. 20 పంపులకు గాను 400 ఎంఎల్ మందును మాత్రమే పిచికారి చేయాలని, ఎక్కువ డోసు పిచికారి చేయడం ద్వారానే పొలం ఎర్రబారి పోయినట్లు తెలిపారు. మోతాదు మించి ఎక్కువ ఎక్కువ డోస్ తో విక్రయాలు జరిపినటువంటి మన గ్రోమోర్ సెంటర్ పై చర్యలు తీసుకోనున్నట్లు ఏవో స్ప‌ష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img