బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు
బీసీలకు 42% రిజర్వేషన్లు లభించే వరకు పోరాడుతాం
వరంగల్ జిల్లా అఖిలపక్ష సమావేశంలో గందరగోళం
ప్రతిపక్ష నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించారు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం తప్పుడు లెక్కలతో బీసీలకు రిజర్వేషన్ లలో అన్యాయం చేసిందని బీసీ సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం సమానంగా కాకుండా బీసీలకు 2024లో నిర్వహించిన కులగణన ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ నేత ఆకుల శ్రీనివాస్ దుయ్యబట్టారు. బీసీ నాయకులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా లోని ఒక మండలం లో ఎస్సీ,ఎస్టి,బీసీ అందరి కి సమానంగా 4 సీట్ల చొప్పున కేటాయించారని ఇది జనాభా లెక్కలకు సరిపోలడం లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా సరైన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 42% సీట్లు కేటాయించి మరల రిజర్వేషన్ లిస్ట్ ప్రకటించాలని హెచ్చరించారు.
బీసీ నేతలు కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో బీసీ లకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించి మీటింగ్ ను వాకౌట్ చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే తీవ్ర ఆందోళనలు, పోరాటాలు ఉంటాయని బీసీ సంఘాలు హెచ్చరించాయి.


