ఇందుర్తి విద్యార్థుల కీర్తి జిల్లా స్థాయికి ఎంపిక
కాకతీయ, కరీంనగర్ : శుక్రవారం సుందరగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి జనవిజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ఇందుర్తి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపిక అయ్యారు. సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్ జిల్లాస్థాయిలో నిలిచిన విద్యార్థులుగా ఎంపిక కావడంతో పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మండలంలోని 12 పాఠశాలలు పాల్గొన్న ఈ పరీక్షలో ఇదే పాఠశాలకు మూడు స్థానాలు రావడం విశేషంగా నిలిచింది.జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి పావని, ఇన్‌చార్జ్ వనిత, ఓదెలు కుమార్ అభినందించారు. ఇందుర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


