- ఆత్మకూరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు
కాకతీయ, ఆత్మకూరు : ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు తెలిపారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బయ్యా కుమారస్వామి ఆధ్వరంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం వాసు మాట్లాడుతూ ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జయపాల్ రెడ్డి. మాజీ ప్యాక్స్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, గ్రామ ప్రధాన కార్యదర్శి అలువాల రవి, మండల కార్యదర్శులు మంతుర్తి రవి, వడ్డేపల్లి ప్రసాద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్ర శివారెడ్డి, ఓబీసీ కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు, సీనియర్ నాయకులు ఉప్పల సుదర్శన్, సంగే మహేందర్, జన్ను సాంబయ్య, మనగాని తిరుపతి, కోల రంపాల్, గంగినేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.


