epaper
Thursday, January 15, 2026
epaper

విజ‌య‌వంతంగా ఇందిర‌మ్మ ఇండ్లు..

  • ప‌థ‌కంపై ఏఐసీసీ అధ్య‌క్షుడి ఆరా..
  • ఖ‌ర్గేను ప‌రామ‌ర్శించిన మంత్రి పొంగులేటి ..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమలవుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పొంగులేటి మంగ‌ళ‌వారం పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమ‌లు, చెల్లింపులు ల‌బ్దిదారుల‌ ఎంపిక విధానం, ఒక్కో ఇంటికి యూనిట్ కాస్ట్ .. త‌దిత‌ర‌ అంశాల‌పై ఖ‌ర్గే మంత్రిని అడిగి తెలుసుకున్నారు.

దేశంలోనే తొలిసారి..

భార‌త‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే పేద‌ల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో ఇందిర‌మ్మ ఇంటిని నిర్మించుకునే స‌దుపాయాన్ని క‌ల్పించామ‌న్నారు. ఇండ్ల ప‌థ‌కాల‌లో కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే అన్ని రాష్ట్రాలు స‌రిపెడుతున్నాయ‌ని కానీ తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో నాలుగు వంద‌ల చ‌ద‌ర‌పు అడుగులు త‌గ్గ‌కుండా ఇండ్ల‌ను ల‌బ్దిదారుడే నిర్మించుకునేలా ప‌థ‌కాన్ని రూపొందించామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు. రాష్ట్రంలో గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో పేద‌లు ఆశించిన మేర‌కు ఇండ్ల నిర్మాణాలు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఇందిర‌మ్మ ఇండ్ల‌కు డిమాండ్ అధికంగా ఉంద‌ని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని మొద‌టి ద‌శ‌లో ఈ ఏడాది 22,500 కోట్ల రూపాయిల‌తో నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4.50 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ల‌బ్దిదారుల ఎంపిక పూర్తికాగా దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని తెలిపారు. గ‌త నెల‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు ఇందిర‌మ్మ ఇండ్ల గృహ‌ప్ర‌వేశాల‌కు స్వ‌యంగా హాజ‌రయ్యార‌ని వివ‌రించారు. ఇంటి నిర్మాణ ద‌శ‌ల‌ను బ‌ట్టి ల‌బ్దిదారుల‌కు ప్ర‌తి సోమ‌వారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధుల‌ను జ‌మ చేస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ల‌బ్దిదారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం, పేద‌రిక‌మే అర్హ‌త‌గా ఇండ్ల‌ను మంజూరు చేస్తున్నాం.

అడ‌వుల‌ను న‌మ్ముకొని జీవించే చెంచుల‌కు సైతం తొలిసారిగా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మంజూరు చేశామ‌న్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో ఎటువంటి అవినీతి అక్ర‌మాలు చోటుచేసుకోకుండా ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను ప్ర‌త్యేకంగా ఒక కాల్ సెంట‌ర్‌ను ఇటీవ‌ల ఏర్పాటు చేశామ‌ని , కాల్ సెంట‌ర్‌కు వచ్చే ఫిర్యాదుల‌పై 24 గంట‌ల్లోనే చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు తీరుతెన్నుల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు స‌విరంగా వివ‌రించ‌గా ఖ‌ర్గే గారు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు బాగుంద‌ని ఇదే విధంగా ముందుకు సాగాల‌ని మంత్రి పొంగులేటిని అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img