కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండల ఆఫీస్ వద్ద బుధవారం రోజున ఎంసీపీఐయు ఆధ్వర్యంలో పేద ప్రజల ఇండ్ల కోసం ధర్నా చేశారు. అనంతరం ఎంసీపీఐ యు నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ శ్రీకాంత్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ యు నగర కార్యదర్శి మాలోత్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు, ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను ఖిలా వరంగల్ మండల పరిధిలో చాలా కుటుంబాలకు అమలు కావడం లేదని అన్నారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బిల్లులు రావడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఐతం నగేష్ .ఎగ్గని మల్లికార్జున్. మాలి ప్రభాకర్ .మంద రవి మాలోత్ ప్రత్యూష, కోటేశ్వర్, అల్లాడి యాకయ్య, పూలమ్మ, కైసర్ జమునమ్మ, పెద్ద లావణ్య మున్ని లక్ష్మి, విజయ, లావణ్య దామెర రమేష్ రాజల్ల అడుప యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


