- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భారతదేశ మొట్టమొదటి మహిళ ప్రధాని, ఇందిరా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఐక్యత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన ఇందిరాగాంధీ సేవల చిరస్మరణీయమన్నారు. ఆమె చూపిన మార్గదర్శనం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోందని అన్నారు. సమాజంలో సమానత్వం, మహిళా సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచారని, దేశ ప్రజల హక్కుల కోసం చివరి వరకూ పోరాడిన మహోన్నత నాయకురాలని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే మోలుగూరి బిక్షపతి, కట్కూరి దేవేందర్ రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్ కుమార్, కొలుగూరి రాజేశ్వర్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


