ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనుకల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి మహిళా ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారత దేశ అభివృద్ధికి కృషి చేశార న్నారు.ఉక్కు మహిళగా పేరుందిన ఏకైక మహిళ ఇందిరా గాంధీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ, మండల సమన్వయ కమిటీ అలువాల శ్రీనివాస్,డోర్నకల్ నియోజకవర్గ యూత్ ప్రధానకార్యదర్శి రేఖఅనిల్,చిర్ర సతీష్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


