కాకతీయ, కెరీర్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ తాజాగా ఇంజనీర్/ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, OBC, EWS అభ్యర్థులు కనీసం 65శాతం మార్కులు సాధించి ఉండాలి. SC, ST, PwBD కేటగిరీలకు మాత్రం 55శాతం మార్కులు ఉండాలి. వయస్సు పరిమితి 26 సంవత్సరాలు కాగా, రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపులు కూడా ఉంటాయి.
ఈ నియామక ప్రక్రియలో ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్ (GD/GT) పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఆన్‌లైన్‌లో 21 సెప్టెంబర్ 2025 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలని IOCL ప్రకటించింది. అభ్యర్థులు 17 అక్టోబర్ 2025 నుండి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CBT పరీక్ష 31 అక్టోబర్ 2025న నిర్వహించనున్నారు.
IOCLలో ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతభత్యాలు లభిస్తాయి. ప్రాథమిక జీతం రూ.50,000 నుండి రూ.1,60,000 వరకు ఉండగా, మొత్తం వార్షిక ప్యాకేజ్ సుమారుగా రూ.17.7 లక్షల వరకు ఉంటుంది. అదనంగా HRA, మెడికల్ సదుపాయాలు, బోనస్, ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తారు. ఈ ఉద్యోగాలు స్థిరమైన కెరీర్‌కి తోడు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి మంచి అవకాశం కల్పిస్తాయి.
వెబ్‌సైట్‌కి వెళ్లి Careers → Latest Job Openings విభాగంలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. తరువాత రిజిస్ట్రేషన్ నంబర్‌తో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు IOCL ఉద్యోగాలు ఒక సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా 21 సెప్టెంబర్ 2025లోపు దరఖాస్తు చేసుకోండి.


