epaper
Sunday, March 1, 2026
epaper

26 మంది ప్రాణాల కంటే పాకిస్తాన్ తో మ్యాచ్ ముఖ్యమా? ఓవైసీ ఫైర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ఈ రోజు జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలు విపక్ష పార్టీలు కూడా తీవ్రంగా తప్పుబట్టాయి. దేశ భద్రత, పౌరుల ప్రాణాల కంటే ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమైందా అంటూ ప్రశ్నించారు.

ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ లో మన 26 మంది పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని చెప్పే దమ్ము మీకు లేదా అని అసోం, యూపీ సీఎంలను ఉద్దేశించి ఓవైసీ ప్రశ్నించారు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా బీసీసీఐకి వచ్చే రూ. 2వేల కోట్లు, రూ. 3వేల కోట్లు 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఎక్కువైపోయాయా అంటూ నిలదీశారు. రక్తం నీరు కలిపి పారలేవని..ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగవని గతంలో ప్రధాని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ 26మంది పౌరుల కుటుంబాలకు తాము నిన్న, నేడు, రేపు కూడా అండగా నిలుస్తామని ఓవైసీ స్పష్టం చేశారు.

భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ కేవలం క్రీడా ఉత్కంఠ మాత్రమే కాకుండా, రాజకీయ వేడెక్కింపూ కనిపిస్తోంది. ఈ పోరును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బహిరంగంగా డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ మాట్లాడుతూ – “ఒకవైపు ప్రభుత్వం ఉగ్రవాదంతో చర్చలు జరపబోమంటూ హామీ ఇస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడమని అనుమతి ఇవ్వడం ద్వంద్వ వైఖరి కాదా?” అని ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశానికి తప్పు సందేశాన్ని ఇస్తోందని ఆయన విమర్శించారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మరింత ఘాటుగా నిరసన తెలిపింది. ఢిల్లీలో పాకిస్థాన్ ప్రతీక బొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ – “మన కుటుంబాల ప్రాణాలను బలి తీసుకున్న వారితో మన ఆటగాళ్లను మైదానంలో నిలబెట్టడం ఎంత పెద్ద అన్యాయం!” అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్బులు, రెస్టారెంట్లను బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద, ఆసియా కప్‌లోని ఈ పోరు కేవలం క్రికెట్ కాదని, ఇప్పుడు కేంద్రం – విపక్షాల మధ్య కొత్త రాజకీయ చర్చలకు వేదికగా మారిందని చెప్పవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img