విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి
* నర్సయ్యపల్లి పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
* విద్యార్థులు ధరించిన పాత్రలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలి
* మద్దూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ
కాకతీయ,మద్దూర్ : మద్దూర్ మండల పరిధిలోని నర్సయ్యపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థి టీ.ఆకాష్ డిఈఓ గా.జి. మాధవి ప్రధానోపాధ్యాయులుగా,ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ అధికారులుగా వేషధారణ గావించి ఒకరోజు స్వపరిపాలన కొనసాగించారు. విద్యార్థులే ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు అయిన వేళ స్వపరిపాలన దినోత్సవం పలువురిని అలరించింది. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధనను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దూరు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, నర్సయ్యపల్లి గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ, ఏఏపీసి చైర్మన్ కనకలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

కృషి పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని విద్యార్థులకు సూచించారు.విద్యార్థుల్లో దాగి ఉన్న సృజ నాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు.విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో పాఠశాల చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయని, వారు ధరించిన పాత్రలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.రాజేశం, ఉపాధ్యాయులు జి. ఆంజనేయులు,బి. నర్సింహులు,కె రత్నమాల జి. సుభాషిని, బి. రజినీకాంత్, బి. భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రాగుల బాల నర్సయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.


