కాకతీయ, ఇనగాల: 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వరంగల్ కుష్ మహల్ గ్రౌండ్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఉత్తమ ఉద్యోగులకు, సమాజని కృషి చేసిన వ్యక్తులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఇనగాల చారిటబుల్ ట్రస్టు గత 12 సంవత్సరాలుగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్బంగా మంత్రి శ్రీ పొంగులేటి శ్రనివాస్ రెడ్డి సంస్థ ట్రస్టీ మెంబర్ శ్రీమతి ఇనగాల అవంతి రెడ్డికి ప్రశంశా పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మా ట్రస్ట్‌కు ఉత్తమ సేవా అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నామని, మా నిబద్ధతను గుర్తించినందుకు జిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.
ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా:
* MGM ఆసుపత్రిలో పిల్లల కోసం రూ.1 కోటి రూపాయల పరికరాలను అందించారు.
* వరంగల్, హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా TB ముక్త్ భారత్ అభియాన్ కింద ఒక సంవత్సరం పాటు 18 మంది TB రోగులకు ప్రతి నెలా సహాయం అందించడానికి రాష్ట్ర గవర్నర్ ద్వారా లక్ష రూపాయలు అందించారు.
* 40 గ్రామాల్లో రోడ్లు, బోర్‌వెల్‌లు, LED లైటింగ్‌ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లకు భూమిని విరాళంగా అందించారు.
* స్పాన్సర్డ్ విద్య, 200+ రోగులకు వైద్య సంరక్షణ, వివాహాలు, జీవనోపాధికి సహకరించారు.
* ప్రజ్వల (ట్రాఫికింగ్ వ్యతిరేక) స్పూర్తి (అనాథాశ్రమం) కు ప్రధాన సహకారాలు.
* 1లక్ష మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే “పేదలకు ఆహారం” డ్రైవ్‌లను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, వరంగల్ నగర సిపీ సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి గార్లు ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గోన్నారు.



