హామీలు అమలుచేయండి
ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించాలి
ఎమ్మెల్యే యశస్వినికి వినతిపత్రం
కాకతీయ, పాలకుర్తి : ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుగులోత్ దేవ్ సింగ్ కోరారు. ఈమేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఫోరం ప్రతినిధులు కలసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మీ అభ్యర్థనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాల మంజూరు చేయాలని, గుర్తింపు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల జారీచేయాలని కోరారు. ఉచిత రైల్వే, బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు త్వరలోనే అమలవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు, కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు గుగులోతు రాములు నాయక్ (దేవ్ సింగ్)తో పాటు మండల అధ్యక్షుడు అంజిరావు, వీరమనేని యాకాంతరావు, ఎడవెల్లి దండయా, కమ్మగాని రమేష్, మల్లారెడ్డి, ఐరన్ల మార్ కొండయ్య, సంఘీ వెంకన్న, నల్లమాస రమేష్, వంగాల తిరుపతిరెడ్డి, పి యాకయ్య, సింగ మహేందర్ రాజు, కత్తుల సీతారాములు, ఆరూరి సోమన్న, గాంధారి నాగన్న తదితరులు పాల్గొన్నారు.


