epaper
Tuesday, March 3, 2026
epaper

నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి

నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి
కాకతీయ, నల్లబెల్లి : జూనియర్ అసిస్టెంట్ వాంకుడోతు కల్పన ఆత్మహత్య యత్నానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని, అక్కడి అధికారులను అక్రమాలకు ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. గిరిజన ఉద్యోగి అయిన కల్పన ఆత్మహత్య యత్నంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం గర్హనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్పన తన సూసైడ్ నోట్‌లో లైంగిక వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ఒత్తిడిని స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఎమ్మార్వోకు కల్పన పలు మార్లు తన సమస్యలను తెలిపినా, స్పందించకపోవడం, పైగా కాంగ్రెస్ నాయకులతో రాజీ పడాలని చెప్పడం వల్లే ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించారని ఆరోపించారు. మైనింగ్, మట్టి మాఫియాలకు రెవెన్యూ అధికారుల మద్దతు, కాంగ్రెస్ నాయకుల దుర్వినియోగం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ సర్పంచ్ రాజారాం, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోత్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో...

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం “అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం హెల్మెట్...

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్ సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం...

కొమ్మాల జాతరపై డేగ కన్ను

కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు...

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img