epaper
Wednesday, March 4, 2026
epaper

అక్రమ పట్టా రద్దు చేయాలి

అక్రమ పట్టా రద్దు చేయాలి
పేదలకు పట్టాలు ఇవ్వాలి
కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర నాగారం రెవెన్యూ శివారు సర్వే నం. 109/ఏ/ఈలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరుతో అక్రమంగా పట్టా మంజూరు చేయడంపై సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేసి, భూమిలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భూమిగా ఉన్న ఈ 40 ఎకరాల్లో 30 ఎకరాలపై చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారని, మిగిలిన 10 ఎకరాల్లో 570 మంది పేదలు ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని తెలిపారు. ఈ భూమికి పుల్యాల వసంతకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె భర్త కృష్ణారెడ్డి లాయర్ ప్రభావాన్ని వినియోగించి దొంగ పత్రాలు సృష్టించి అక్రమంగా పట్టా తీసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి భూమి ప్రభుత్వదేనని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కూడా ఇదే నిర్ణయాన్ని వెలువరించారని చెప్పారు. ఈ భూమిపై కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. పేదలను, రైతులను బెదిరించి, చట్టాలను ఉల్లంఘించి భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూమిపై నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ భూమి కోసం సిపిఎం ఎన్నో సార్లు పోరాటాలు చేసినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అక్రమ పట్టాను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్, రత్నం ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కలవల రవీందర్‌తో పాటు మండల కమిటీ సభ్యులు కడారి నాగరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, శాఖ కార్యదర్శి శ్రీరామోజు సువర్ణ, చిన్నపెళ్లి అశోక్, తిప్పర్తి సరళ, కోయిల సులోచన, మన్సోజు బ్రహ్మచారి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

పోడు భూములకు పట్టాలివ్వాలి

పోడు భూములకు పట్టాలివ్వాలి తుడుం దెబ్బ డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం : పోడు భూములకు...

డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట...

నాగలక్ష్మి ఆలయంలో చోరీ

నాగలక్ష్మి ఆలయంలో చోరీ విగ్ర‌హాలు విలువైన సామాగ్రి అప‌హ‌ర‌ణ‌ ఆకులవారి ఘనపురంలో ఘ‌ట‌న‌ గ్రామంలో...

అడవులను ర‌క్షించాలి

అడవులను ర‌క్షించాలి వ‌న్య‌ప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు...

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల...

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం..

నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సప్తవర్ణ అభిషేకం.. స్వామివారికి హోలీ ప్రత్యేక పూజలు.. కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img