జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్
రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందు
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలోని ‘సెరా లైఫ్’ పేరుతో నడుస్తున్న ఒక క్లినిక్‌ను గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆ క్లినిక్ ఎటువంటి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని గుర్తించారు.ఈ సందర్భంగా డాక్టర్ చందు మాట్లాడుతూ. రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని, అప్పటివరకు క్లినిక్‌ను మూసివేయాలని ఆదేశించారు.ప్రజలు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులచే మాత్రమే వైద్యం చేయించుకోవాలని, అర్హత లేని వైద్యులపై నమ్మకం ఉంచి ప్రాణాలను ప్రమాదంలో పడవేయవద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ తనిఖీలో రాజేందర్ రాజు (సబ్ యూనిట్ ఆఫీసర్), సిబ్బంది నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


