అక్రమ అరెస్టులు బీసీ ఉద్యమాన్ని అపలేవు
కాకతీయ, దుగ్గొండి : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పోరాడుతున్న దుగ్గొండి మండలంలోని ఇద్దరు నేతలను, ఇతరులను గురువారం అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు కడరి సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లు బీసీ ఉద్యమాన్ని అపలేవన్నారు. రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మున్ముందు జరిగే ఉద్యమాలకు ఐక్యంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.


