సిరిసిల్లలో ఐజీపీ సమీక్ష
శాంతిభద్రతలపై ఫోకస్
దర్యాప్తు నాణ్యత, కమ్యూనిటీ పోలీసింగ్‌పై ఆదేశాలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించి జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సర్కిల్ వారీగా శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో భద్రతాభావం కలిగేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కేసుల దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచాలని పోలీస్ సిబ్బంది చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆదేశించారు. స్టేషన్లలో రికార్డుల నిర్వహణను సక్రమంగా ఉంచుతూ 5S విధానాన్ని అమలు చేయాలని, ప్రోయాక్టివ్, విజిబుల్, కమ్యూనిటీ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలపై కఠిన నిఘా కొనసాగించాలని, “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి తదితర అధికారులు పాల్గొన్నారు.


