epaper
Wednesday, March 25, 2026
epaper

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌

లైట్ తీసుకుంటే..లైసెన్స్ లాక్‌
ట్రాఫిక్ చలాన్లపై ప్ర‌భుత్వం క‌ఠిన రూల్స్‌
ఫైన్ చెల్లించ‌కుంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రీజ్‌
ఏప్రిల్ నుంచి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చేందుకు స‌న్న‌ద్ధం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ చలాన్లను చెల్లించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌ల‌కు దిగ‌నుంది. పెండింగ్ చలాన్లు ఎక్కువగా ఉండి, వాటిని చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండూ ఫ్రీజ్ చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రూల్స్ తీసుక‌వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో కూడా ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలతో వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు. కొత్త రూల్స్ ప్రకారం ఏడాదిలో ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉండి, వాటిని చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఫైన్లను నిర్లక్ష్యం చేస్తే మొదటగా లైసెన్స్, ఆ తర్వాత వాహన రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. ఇది వాహనదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒకసారి ఫ్రీజ్ అయితే వాహనం వినియోగం పూర్తిగా నిలిచిపోతుంది.

డెడ్‌లైన్ మించితే సీజ్ తప్పదు

చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్ట గడువు ఇస్తుంది. సాధారణంగా నలభై ఐదు రోజుల సమయం ఉంటుంది. ఈ గడువులోపు ఫైన్ చెల్లించకపోతే వాహనంపై కఠిన చర్యలు ప్రారంభమవుతాయి. గడువు ముగిసిన తర్వాత కూడా పెండింగ్ కొనసాగితే సీజ్ ప్రక్రియ తప్పదు. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల తప్పుగా చలాన్లు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ ఏర్పాటు చేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. పొరపాటుగా జారీ చేసిన చలాన్లను పరిశీలించి రద్దు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలు వాహనదారుల్లో చర్చకు దారితీశాయి. ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించడం తప్పనిసరి అవుతోంది. హెల్మెట్ ధరించడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం వంటి ప్రాథమిక నిబంధనలను పాటించడం ద్వారా చలాన్ల నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే లైసెన్స్, వాహనం రెండూ ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేత‌న్న‌ను కాపాడండి

నేత‌న్న‌ను కాపాడండి రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయండి ‘బ్యాక్ బిల్లింగ్’...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..! చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై...

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఎస్ఎస్బీలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల టెన్త్,...

ఆర్టీసీలో జాబ్ రేస్‌..

ఆర్టీసీలో జాబ్ రేస్‌.. 198 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 26,160 మంది అభ్యర్థుల...

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై?

టెన్త్ పరీక్షలకు గుడ్‌బై? విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం సంచలన వ్యాఖ్యలు ఎస్ఎస్‌సీ బోర్డు రద్దు...

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌.. మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు

డ‌బ్బులిస్తేనే లోడింగ్‌ మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి ఇసుక‌ క్వారీలో వ‌సూళ్లు లారీల ఓన‌ర్ల నుంచి...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

పెంపుడు పిల్లి చ‌నిపోవ‌డంతో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌ రెండేళ్లుగా విడ‌దీయ‌రాని బంధం మార్జాలం చినిపోవ‌డంతో మ‌నోవేద‌న‌ పురుగుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img