epaper
Monday, March 2, 2026
epaper

భర్తను తలచుకుని కన్నీళ్లు పెడితే చిల్లర రాజకీయాలా..

  • ఆడబిడ్డను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం
  • కాంగ్రెస్‌ మంత్రులపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌
  • జుబ్లిహిల్స్‌లో ఓట్ చోరీపై రాహుల్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్‌
  • కాంగ్రెస్‌, బీజేపీ రెండు తెలంగాణ‌కు ప్ర‌మాద‌మేనంటూ వ్యాఖ్య‌
  • నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరిక‌లు..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: భర్తను తలచుకుని బాధలో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీత దుఃఖాన్ని అవమానించేవిధంగా కాంగ్రెస్‌ మంత్రులు నానా మాటలు మాట్లాడుతున్నారని, విజ్ఞత మరచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బీజేపీ నుంచి 200మంది బీఆర్‌ఎస్‌లోకి చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ప్రజల ఆశీర్వాదంతో మాగంటి గోపీనాథ్‌ ఐదేండ్ల కోసం బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు చనిపోయారు.. అందుకే జూబ్లీహిల్స్‌ నుంచి మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీతకు టికెట్‌ ఇచ్చామని తెలిపారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.

ప్రజలు విజ్ఞులు..

ప్రజలు విజ్ఞులు.. ప్రజలు మంచి, చెడు ఆలోచిస్తారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఓట్‌ చోరీ అని రాహుల్‌ గాంధీ అంటున్నాడని.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే ఎందుకు మాట్లాడవని రాహుల్ గాంధీని నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఓటు చోరీ చేయకుండా నిజాయితీగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో భర్తను కోల్పోయిన సునీతను ఒడడగొట్టాలని 20 వేల దొంగ ఓట్లను కూడగట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి అని అవిమర్శించారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణ్ అని అంటారు. మోదీ సబ్ కా సాత్ సబ్‌కా వికాస్ అంటారని గుర్తుచేశారు.

పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు..

హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణ్ ఆ అని ప్రశ్నించారు. పెద్దపెద్ద ఇల్లులు కూల కొట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్లల్లనే ఉంటది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు హైడ్రాలనే ఉంటది. ఎమ్మెల్యే గాంధీ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఉంటాడని అన్నారు. పండుగ పూట ఆదివారం నాడు రాత్రి వచ్చి గరీబోళ్ల ఇల్లు కూలగొట్టి వేల కుటుంబాలను రోడ్డుమీదికి తెచ్చిండు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్‌ గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు.. పేదోళ్ల ఇల్లులు ఎందుకు కూలగొడుతున్నావ్ రేవంత్ రెడ్డి అని రాహుల్ గాంధీ ఎందుకు అడగడం లేదని హ‌రీష్‌రావు ప్రశ్నించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img