epaper
Friday, November 14, 2025
epaper

బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే ఆపేస్తాం

బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే ఆపేస్తాం..!

కాక‌తీయ‌, జాతీయం : హర్యాణా డీజీపీ ఓ.పీ. సింగ్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. థార్, బుల్లెట్ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కావని.. కొందరికి అవి “స్టేటస్ సింబల్”గా మారాయని ఆయన అన్నారు. శనివారం గురుగ్రామ్‌లో విలేకరులతో మాట్లాడిన ఓపీ సింగ్.. ప్రతి వాహనాన్నీ రోడ్డుపై నిరంతరం ఆపి తనిఖీ చేయలేము. కానీ బుల్లెట్ లేదా థార్ క‌నిపిస్తే మాత్రం త‌ప్ప‌క ఆపేస్తాం. ఎందుకంటే అల్లరిచిల్ల‌ర‌గా తిరిగేవారు, పోకిరీలు ఎక్కువగా ఇవే వాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఒక వ్యక్తి ఎంచుకునే వాహనం వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా థార్ అంటే కేవలం ఒక కారు కాదు. అది ‘నేను ఎవరు’ అని చూపించే స్టేట్‌మెంట్ గా మారిపోయింది. నేటి తరం దానిని స్టేటస్ సింబల్‌గా ఉపయోగిస్తుందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. థార్ లేదా బుల్లెట్ నడిపే చాలా మంది రోడ్లపై స్టంట్లు చేస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన అస‌హనం వ్యక్తం చేశారు.

ఓపీ సింగ్ తన వ్యాఖ్యల్లో ఒక తాజా ఘటనను ప్రస్తావించారు. ` ఒక ఏసీపీ కుమారుడు థార్‌తో ఒకరిని ఢీకొట్టి చంపాడు. ఇప్పుడు ఆ ఏసీపీ తన కొడుకును విడిపించాలని కోరుతున్నాడు. కానీ ఆ కారు ఎవరి పేరుమీద ఉందని ఆరా తీయ‌గా.. అది ఆయనదే అని తేలింది. కాబట్టి అసలైన పోకిరి ఆయ‌నే` అంటే ఓపీ సింగ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యతో డీజీపీ చట్టం ముందు ఎవరికీ రాయితీ లేదనే సందేశం ఇచ్చారు.

కాగా, థార్ లేదా బుల్లెట్ వంటి వాహనాలు యువతలో యాటిట్యూడ్ సింబల్‌గా మారడం, సేఫ్టీ కన్నా షో-ఆఫ్‌ కల్చర్ పెరగడం పోలీస్ అధికారులకు ఆందోళనగా మారింది. హెల్మెట్ లేకుండా బుల్లెట్‌పై రైడ్‌ చేయడం, ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించడం, పబ్లిక్ రోడ్లపై స్టంట్లు చేయడం.. ఇవన్నీ పోలీస్‌ల దృష్టిలో పెద్ద ముప్పుగా నిలుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వాహనం ఎలా ఉంటుందో కాదు.. దాన్ని నడిపే వ్యక్తి ఆలోచన, ప్రవర్తన ముఖ్యమ‌ని ఓ.పీ. సింగ్ స్పష్టం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ప్రస్తుతం నెట్టింట‌ చర్చనీయాంశమయ్యాయి. కొంద‌రు ఓ.పీ. సింగ్ వ్యాఖ్య‌ల‌ను మ‌ద్ద‌తు ఇస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం ` అందరూ ఒకేలా ఉండ‌రు.. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని బిగిస్తాయని` విమర్శిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img